బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపి హెల్త్‌కేర్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరచే దిశగా.. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BROEC) అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ముఖ్యమైన విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. అపోలో మెడ్‌స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్.