రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు, విద్యార్ధులను తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. సుమారు 2 వేల నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండొచ్చని అంచనా వేసింది విదేశాంగ శాఖ. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ నుంచి రాష్ట్ర విద్యార్థుల తరలింపుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు రాష్ట్ర ప్రతినిధుల్ని పంపిస్తోంది. హంగేరీలోని బుడాపెస్ట్ కు చేరుకున్నారు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్…