ఏపీ రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావటంతో, రోడ్ల వెంట చెట్లు, చెత్తను తొలగించే పనులు మొదలయ్యాయి. ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం అమరావతి ప్రాంతంలో పనులను పరిశీలించారు. జేసీబీ యంత్రాలతో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ మొదలయ్యాయి. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.
రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అన్నారు జగన్. ఈ సిటీలో రోడ్లు వున్నాయి. కరెంట్, అన్ని రకాల వసతులు వున్నాయి. సుందరీకరణపై శ్రద్ధ పెడితే విశాఖ హైదరాబాద్ తో పోటీపడుతుందన్నారు. మూడురాజధానుల విషయలో జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్నదానికి అర్థం పర్థం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. సీఎం జగన్ నిర్ణయాలతో జనానికి తీరని లోటని తప్పుబట్టారు. వికేంద్రీకరణ…