ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైట్ కుర్తా ఫైజామాలోనే పవన్ ఎక్కువగా కనిపించారు. చాలా రోజులు తర్వాత ఈరోజు రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు షర్ట్, ఫ్యాంట్ వేసుకొచ్చారు. షర్ట్, ఫ్యాంట్‌తో టక్ చేసుకొచ్చిన పవన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: Akhanda Godavari Project:…
చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ను చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌తో రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు…
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కక్షతో సొంత కొడుకుని పురుగుల మందు తాగించి తండ్రి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. గణపవరం మండలం జల్లి కాకినాడకు చెందిన చూడదశి చంద్రశేఖర్, స్వరూపలకు ఆరేళ్ల సాత్విక్, సృజన ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వరూప గతంలో దుబాయ్‌లో ఉద్యోగం చేసి స్వగ్రామం చేరుకుంది. వచ్చే నెలలో తిరిగి దుబాయ్ వెళ్లేందుకు స్వరూప సిద్ధం అవ్వడంతో అందుకు చంద్రశేఖర్ నిరాకరించాడు. స్వరూప దుబాయ్ వెళితే కొడుకు ఏడేళ్ల…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ ఇంటి పేరు ‘కొణిదెల’ అన్న విషయం తెలిసిందే. జనసేన…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెండో నిందితుడిగా ఉన్నారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో వైఎస్ జగన్ పిటిషన్‌తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి…
రాజమండ్రి (రాజమహేంద్రవరం) ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు నేడు శంఖుస్థాపన జరగనుంది. గురువారం ఉదయం 10 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు.. ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇకపై రాజమండ్రి పర్యాటక శోభను సంతరించుకోనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత పిటిషన్‌ను గురువారం (జూన్ 26) విచారిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ఏ2గా ఉన్నారు. Also Read: CM Chandrababu: హైదరాబాద్ కంటే.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం! వైఎస్ జగన్…
హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. టెక్నాలజీ మన జీవితంలో భాగంగా మారుతుందన్నారు. ‘వికసిత్ భారత్’ అనేది ప్రధాని మోడీ లక్ష్యం అని, అలాగే ‘స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్’ అనేది మన లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో…
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి…
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు చెప్పింది. రేపటి నుంచి ఈనెల 30 వరకు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు నిరాశ చెందారు.