ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. రాత్రి నాటికి పూర్తి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎంపీటీసీ…