అమ్మ పలుకు.. జగదాంబ పలుకులపై వైసీపీ నేతలకు గురి పెరిగిందా? మంత్రి పదవి ఆశిస్తున్నవారంతా ఉత్తరాంధ్రలో ఎక్కడో మారు మూల ప్రాంతంలోఉన్న ఓ పల్లెటూరుకు క్యూ కడుతున్నారా? ఇంతకీ ఆ గ్రామంలో ఏముంది? వైసీపీ నేతలకు ఎందుకంత నమ్మకం? దేవుడమ్మ లలిత ఆశీసుల కోసం రోజా రాక..! ఎక్కడో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్య వలస గ్రామంలో ఒక్కసారిగా తళుక్కుమన్నారు. పార్టీ ప్రచారానికి వచ్చారని అనుకోవడానికి…