ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది. సీఎం జగన్ వినుతల పైన ప్రధాని ఈ సారి వేగంగా స్పందించి, సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. సుదీర్ఘ కాలంగా ఏపీకి దక్కాల్సిన బకాయిల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ డిస్కమ్ ల నుంచి ఏపీకి బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.. ఇదే అంశం పైన గతంలో పలు మార్లు కేంద్రానికి ఏపీ నివేదించినా,…