Andhra Pradesh Schools: ఏపీలో స్కూల్ విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్త అందించారు. ఆగస్టు 27న శనివారం నాడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రెండో శనివారమైన ఆగస్టు 13న విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వచ్చిన నేపథ్యంలో.. ఆగస్టు 13కు బదులుగా ఆగస్టు 27ను సెలవుదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13న అన్ని స్కూళ్లు…
నిన్న పదో తరగతి ఫలితాల్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే! పాస్ శాతం పక్కనపెడితే.. మార్కుల జాబితాలో కొన్ని అవకతవకలు కనిపించాయి. చాలామంది పిల్లలకు పాస్ మార్కులు రాకపోయినా, పాస్ చేసేశారు. వేరే వాళ్ళకు అంతకుమించి మార్కులు వచ్చినా (పాస్ అర్హత కంటే తక్కువే), ఫెయిల్‌గా ప్రకటించారు. దీంతో.. ‘‘ఏంటీ తప్పుల తడక’’ అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా…
రోజుకు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. వేసవి తాపంతో అటు చిన్నారుల నుంచి ఇటు వృద్ధుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సంబంధించి ఒంటి పూట బడుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వేసవి తీవ్రత ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7:30…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్కూల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడారు. ‘‘సాధారణంగా చిరంజీవి కొత్త సినిమాలకు టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ కనిపించని విధంగా నేడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ‘నో అడ్మిషన్స్’ బోర్డులు కన్పిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో…
ఏపీలో ఒకవైపు కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు సంక్రాంతి సెలవుల తర్వాత తెరుచుకున్న పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరవుతున్నారని తొలిరోజు 61 శాతం హాజరు కాగా రెండోరోజు 74 శాతం విద్యార్థులు హాజరయ్యారని మంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని కడప జిల్లాలో 82 శాతం, గుంటూరు 81 శాతం, అనంతపురం 80, కర్నూలు జిల్లాల్లో 78…