ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాలకు ఉన్న పేర్లను మారుస్తూ వస్తోంది.. ఇప్పటికే పలు పథకాల పేర్లు మారిపోగా.. తాజాగా.. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న ఆరు పథకాల పేర్లలో మార్పులు.. చేర్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠ్య పుస్తకాల విషయంలో కొత్త విధానానికి ఏపీ విద్యా శాఖ బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే విధానాన్ని ఏపీ విద్యాశాఖ తీసుకొస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న టెన్త్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. మరింత అప్రమత్తం అయ్యింది పాఠశాల విద్యాశాఖ.. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లను నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్ధులు, ఎగ్జామినర్లు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు వీల్లేదని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. పరీక్షల విధులతో సంబంధం లేని సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాలకు అనుమతించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా…