IMD Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో పయనించి, నేటి అర్థరాత్రి తర్వాత వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.…