ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. ఈనెల 27నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. భీమిలిలో తొలి క్యాడర్ మీటింగ్ చేపట్టనున్నారు. మరోవైపు.. ఎన్నికల శంఖారావం సభ "సిద్ధం" పోస్టర్ ను వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. దాంతో పాటు "సిద్ధం"థీమ్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. విశాఖలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పిడికిలి బిగించిన సీఎం జగన్…