రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నందుకు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా కడుపు మంట చల్లారిందో? అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండని.. అవ్వ, తాత, దివ్యాంగులను లైన్లో మళ్లీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి.. మళ్లీ ఇళ్ల వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు? అని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకుండా ఇళ్ల…
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లోని పింఛనుదారులకు ఏప్రిల్ లో రెండు రోజులు ఆలస్యంగా చెల్లింపులు జరుగుతాయని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా “మేము నెల మొదటి తేదీన పెన్షన్ లను పంపిణీ చేస్తున్నామని, ఇక వచ్చే నెల మొదటి రోజు ఏప్రిల్ 1 న, ఆర్బిఐ కి సెలవుదినం, ఆ తరువాత ఆదివారం రావడం వల్ల ఈ మేరకు మూడో తేదీన (ఏప్రిల్ 3) పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’…