పండుగలు వస్తున్నాయని, ప్రజలను అస్సలు ఇబ్బందులు పెట్టోద్దని ఉద్యోగాలను ఉద్దేశించి ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజలకు సేవలు అందించే మున్సిపల్ శాఖ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని, చర్చలు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ర్యాడికల్ విధానంలో వెళితే సమస్యలు పెరుగుతాయన్నారు. నేడు ఏపీ మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి మహాసభ విశాఖలో జరిగింది. ముఖ్యఅతిథులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. మహాసభ సందర్భంగా సర్వీస్ రూల్స్…