కడప జిల్లా బద్వేల్ లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేదని…