Minister Lokesh: ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందని తెలిపారు. అనేక పెద్ద పరిశ్రమలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఇప్పుడు ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంది. గత ఒక సంవత్సరం కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలను అందించగలిగాం. పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడానికి అనుకూల వాతావరణం, వేగవంతమైన సదుపాయాలు, ప్రభుత్వంతో…