ఏపీ ఇంటర్ బోర్డ్ ఇంటర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల ప్రక్రియను ఈనెల 20 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరి బాబు వెల్లడించారు. ప్రవేశాలను ఆయా కళాశాలలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 20నుంచి జులై 20వరకు మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా శేషగిరి బాబు పేర్కొన్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తామని శేషగిరి బాబు వెల్లడించారు. సీట్ల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేయాల్సి…