శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్థులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. హోం శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం ఏపీ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా పోలీస్ విభాగంలో మొత్తం ఐదు కేటగిరీలుగా పోస్టులు ఉండనున్నాయి. మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీసు ఏఏస్ఐ,…