ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ అక్రమాలు పుట్ట పగిలింది. వృద్ధులు, అనాథల పేరుతో తక్కువ ధరకు భూములు తీసుకుని వేల కోట్లు వ్యాపారం చేసిన రియల్టర్లుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నగరంలో అత్యంత వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.