‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Peddi’: టాలీవుడ్లో ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అనే సామెతను మన ఇండస్ట్రీ పెద్దలు, కొందరు సెలబ్రిటీలు తరచూ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. పక్క ఇండస్ట్రీ నుంచి ఏ చిన్న సినిమా వచ్చినా, బాలీవుడ్ లేదా కోలీవుడ్ హీరోలు కాస్త వైవిధ్యమైన నటన కనబరిచినా.. మనవాళ్లు సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లతో, ప్రశంసల వర్షంతో ముంచెత్తుతారు. “కథల ఎంపికలో వాళ్లు గ్రేట్.. పెర్ఫార్మెన్స్లో వాళ్లు తోపు” అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ, అదే ప్రేమ, అదే ప్రోత్సాహం మన సొంత హీరోల విషయానికి వచ్చేసరికి ఎందుకు మిస్ అవుతోందనేది? ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు మెగా అభిమానులను కూడా వేధిస్తూన్న పెద్ద ప్రశ్న. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విషయంలో టాలీవుడ్ పెద్దలు, స్టార్ హీరోలు పాటిస్తున్న ‘సైలెన్స్’ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
పరభాషా హీరోలపై కురిసే ప్రేమ..
గతకొద్ది కాలంగా టాలీవుడ్ సెలబ్రిటీల సోషల్ మీడియా హ్యాండిల్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. తమిళంలో విభిన్నమైన పాత్రలు చేసిన, మట్టి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన, కన్నడ నుంచి రిషబ్ శెట్టి లాంటి వాళ్లు డిఫరెంట్ అటెంప్ట్ చేసినా, లేదా బాలీవుడ్లో ఏదైనా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ కనిపించినా మన దర్శకులు, హీరోలు పోటీ పడి మరీ అప్రిసియేషన్ పోస్టులు పెడతారు. నిజానికి ఒక సినిమా బాగుంటే అభినందించడం మంచి పద్ధతే, అది ఇండస్ట్రీల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంచుతుంది. కానీ, అదే ఉత్సాహం సొంత ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో సినిమా విషయంలో ఎందుకు కనిపించడం లేదన్నదే ఇక్కడ అసలు పాయింట్ అని నెట్టింట కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
‘పెద్ది’ విషయంలో ఎందుకీ మౌనం
రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రా అండ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ‘రంగస్థలం’ తర్వాత చరణ్ మళ్లీ ఆ రేంజ్ మాస్ అండ్ రా లుక్‌లో కనిపించిన ఈ సినిమాపై టాలీవుడ్ పెద్దల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్వీట్ రాలేదు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో చరణ్ నటన చాలా చాలా బాగుందనే కామెంట్స్ సాధారణ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. పెద్దిలో రామ్ చరణ్ నటన ఎలా ఉందనేది. కానీ ఈ సినిమా చూసిన టాలీవుడ్‌కి చెందిన అగ్ర దర్శకులు గానీ, ప్రొడ్యూసర్లు గానీ దీనిపై పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. పక్క ఇండస్ట్రీల సినిమాలను భుజాన వేసుకుని మోసే మనవాళ్లు.. మన గడ్డపై, మన టాలెంట్‌తో పాన్ – ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన ‘పెద్ది’ విషయంలో ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంటున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
నిజానికి సొంత ఇండస్ట్రీలో ఒక మైలురాయి లాంటి సినిమా పడుతున్నప్పుడు దానికి లభించాల్సిన సపోర్ట్, ఎలివేషన్ ఇండస్ట్రీ లోపలి నుంచే రావాలి. పొరుగు రాష్ట్రాల సినిమాలను ఆదరించడం తప్పు కాదు, కానీ అదే సమయంలో మన స్టార్స్ పడే కష్టాన్ని, మన మేకర్స్ చూపిస్తోన్న క్రియేటివిటీని కూడా సమానంగా ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే కామెంట్స్ సగటు సినిమా అభిమానుల నుంచి వస్తున్నాయి. మరి ఇకనైనా టాలీవుడ్ పెద్దలు ఈ ‘పొరుగింటి పుల్లకూర’ ధోరణిని పక్కనబెట్టి.. ‘పెద్ది’ లాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకు అండగా నిలుస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!