CM Chandrababu: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు గ్రామంలోని ఆరుగురికి డయేరియా లక్షణాలు కనిపించగా, వారికి వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు టెక్కలి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరగా, మొత్తం బాధితుల్లో…
Helpline Number: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో బుధవారం అధికారులు, మంత్రులు సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమగ్రంగా చర్యలు చేపడుతున్నారు. సమస్యపై ప్రాథమిక సమాచారం అందించిన అధికారులు, నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 241 మంది తెలుగువారూ చిక్కుకుపోయారని తెలిపారు. Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..! సమాచారం…
తిరుపతి రూరల్ (మం) దామినీడులో నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సూచన మేరకు ఆర్డీవో, డిఎస్పీ ఇరువురితో సమాలోచన జరిపారు. కూల్చి వేసిన ప్రాంగణాన్ని యధావిధిగా గ్రామస్థులకు వదిలేయాలని కృష్ణమూర్తి నాయుడుకి ఆదేశాలు జారీ చేశారు. నేలమట్టం చేసిన ప్రాంతంలోనే తిరిగి ఆలయాన్ని పునర్ నిర్మించాలని సూచించారు. నెలరోజుల్లో ఆలయ నిర్మాణాన్ని యధావిధిగా నిర్మిస్తానని కృష్ణమూర్తి నాయుడు అంగీకరించారు.