చెప్పింది కొండత… చేసేది గోరంత అన్నట్లుగా మారింది ధాన్యం కొనుగోలు పరిస్థితి. వరి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం.. వెంటనే డబ్బులు రైతుల ఖాతాలో జమచేస్తున్నామంటున్నారు. కానీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో రైతులు పంటను వ్యాపారులకు అయినకాడికి పంటను అమ్ముకుంటున్నారు. బస్తాధాన్యం 1300కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి క్లిష్టంగా మారింది. ఒక వైపు అనిశ్చితమైన వాతావరణం దిగుబడులను దెబ్బతీయగా.. మరోవైపు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా…