ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిదే విజయం.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయేన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు..
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్వరలో తాళం వేసి.. ఆయన హైదరాబాద్ కు జంప్ అవుతారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చెప్పుకొచ్చారు. అలాగే, బీజేపీలో తెలుగుదేశాన్ని కూడా విలీనం చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు నేతలు.. అయితే, వ్యతిరేక వర్గాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు ఒకరని సస్పెండ్ చేయించిన రోజాకు.. ఇప్పుడు ఊహించని రీతిలో రివర్స్ షాక్ తగులుతోంది.
ఈ నెల 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు విధించారు పోలీసులు.. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో…