వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరుల గిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి గెలుపే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు ఉదయగిరి బిట్ టూ ఇంఛార్జి గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి, నియోజకవర్గంలోని మండల నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఇలాంటి డైలాగులు రాయాల్సిన అవసరం ఉందా? అని అడిగితే మీకు తెలియదు సార్, మా బాధలు మాకు ఉన్నాయి. ఇలాంటి డైలాగులు పెట్టకపోతే మీ అభిమానులు ఊరుకోరు, చంపేస్తారు అని అన్నాడని ప
ఏపీలో సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఐదో రోజు దిగ్వజయంగా కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా సీఎం యాత్ర కదిరికి చేరింది. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్.. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తున్నారంటే ఎక్కువమంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని నన్ను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి,
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.