ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు…