AP CM Jagan Schedule Today: సోమవారం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని…