రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి...అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని అన్నారు.
అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.
సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సీనియర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
AP CM Chandrababu: ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిసింది. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరువురి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.…
కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం సచివాలయం దగ్గర గ్రామస్థులతో సీఎం మాట్లాడారు. ఏలేరు వరద ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఏడో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూటా కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు
ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. బాధితుల వద్దకు రెస్క్యూ బృందాలు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు.
విజయవాడలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు.
దేశంలో నాల్గవ భాష తెలుగు, పదికోట్ల మంది మాట్లాడే భాష తెలుగు.. అమెరికాలో తెలుగు 11వ భాష.. అదీ తెలుగువారి సత్తా.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు గొప్పదనం గురించి కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.