ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.
Anna Canteens in AP : ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఓవైపు శాఖలవారీగా ప్రక్షాళన చేస్తూనే… మరోవైపు కీలక పథకాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మరిన్ని…
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె 'పెట్టుకోండి సార్' అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.