పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి, వెన్నెముక లాంటిదని.. అది పూర్తయితే ఏపీ కరవుకు చెక్ పెట్టినట్లేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఉన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ పోలవరం అని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీని భాధకు గురిచేసిందన్నారు. రామ్మూర్తి నాయుడు గారు విప్ బాధ్యతలు తనకు అప్పగించారని, ఎంత బరువైనా పూర్తి సామర్థ్యంతో పని చేస్తానన్నారు. కడప నగరంలో మంచి నీరు, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్పుకొచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెకు తీసుకువచ్చారు. మంత్రి నారా లోకేశ్, హీరో నారా రోహిత్ సహా కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. మరికాసేపట్లో నారావారిపల్లెకు రానున్నారు. Also Read: AUS vs IND: నేనే రోహిత్…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ఆయన భౌతికకాయం చేరుకుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ,ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. సోదరుడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు…
నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని వారికి సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని వెల్లడించారు.
గండికోట ప్రపంచంలో టాప్ 10 ప్రదేశాలలో ఒకటని.. 13వ శతాబ్దం లో నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గండికోటలో కోట సముదాయంలో రాజవంశాల వారసత్వాలు ఉన్నాయన్నారు. గండికోట లోఅడ్వంచెర్ గేమ్స్‌కి అవకాశాలు ఉన్నాయని.. గండికోట లో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి.. ఇవాళే అక్కడ దిగాలనుకున్నామన్నారు. కేంద్రం సహకారంతో సీప్లేన్‌లు ఎక్కువ ప్రాంతాల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, కొంతమంది అధికారుల తీరుపైన చంద్రబాబు మంత్రులతో చర్చించారు. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్నా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేమ్ ఛేంజర్ అయ్యిందో.. రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం కూడా గేం ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.