రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరు నెలల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ఎనర్జీలో పెట్టుబడులు పెట్టెందుకు రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయి.. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2 లక్షల 50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.