ఏదో వచ్చారు… వెళ్లారు అని కాకుండా.. ఏపీ పర్యటనలో ఓ కేంద్రమంత్రి చేసిన కామెంట్స్.. బీజేపీకి టెన్షన్ తెచ్చిపెట్టాయి. రాబోయే కష్టాలు తలుచుకుని కలవర పడుతున్నారట. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు? ఆయన చెప్పిందేంటి? కమలనాథులకు రుచించని ఆ మాటలేంటి? వైసీపీని ఎన్డీయేలో చేరాలన్న అథవాలే..! రాందాస్ అథవాలే. కేంద్రమంత్రి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో భాగస్వామి. మాటలతో.. వ్యంగ్యాస్త్రాలతో.. ప్రాసలతో వైరిపక్షాలకు కూడా నవ్వులు పూయిస్తుంటారు అథవాలే. ఇటీవల విశాఖపట్నం వచ్చిన ఆయన.. కొన్ని పొలిటికల్…