అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల నిప్పులు చెరిగారు. నిన్న వైసీపీ చేసిన అరాచకం నేపథ్యంలో ఏపీ పరిస్థితులపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే నిన్నటి విధ్వంస కాండ చోటు చేసుకుందని… పోలీసులతో కుమ్మక్కై లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కు వైసీపీ పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండారాజ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చారని.. ఇది కాన్సిట్యూషన్ మిషనరీ…
ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా రేపు (అక్టోబర్ 20) ఏపీ వ్యాప్తంగా బంద్ చేయాలని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం దారుణమని, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజకీయ…