తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి నవ్వులు పూయిస్తోంది. రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివితో వచ్చిన ఈ దీపావళి ప్రోమో, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తనదైన కామెడీ…