కరోనా వ్యాధిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు అనురాగ్ యూనివర్సిటీలో ఎలాంటి ప్రత్యక్ష పాఠాలు బోధన జరపడం లేదు. ఉద్యోగాలు పొందిన కొంతమంది విద్యార్థుల అభ్యర్ధన మేరకు పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొన్ని పాఠ్యాంశాలలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో సుమారు ౩౦ మంది పైన ఏబీవీపీ కార్యకర్తలు దాడికి దిగారు. యూనివర్శిటీలో ప్రత్యక్ష బోధనను నిర్వహిస్తున్నారని సాకుగా చూపిస్తూ రాజకీయ దురుద్దేశంతో నిన్న యూనివర్సిటీలోకి ఏబీవీపీ కార్యకర్తలు అక్రమంగా, దౌర్జన్యంగా…