నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ “జాతిరత్నాలు”. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, నరేష్ సహాయక పాత్రలు పోషించారు. పక్కా మాస్ లాంగ్వేజ్ తో, కామెడీ పంచెస్ తో మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. తన చేష్టలతో ఊర్లో పోకిరిగాళ్లు అనే ముద్ర వేయించుకున్న ముగ్గురు…
కోలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ చివరిసారిగా 2019లో “హీరో” చిత్రంలో తెరపై కనిపించారు. కరోనా వైరస్ మహమ్మారి రాకపోయి ఉంటే ప్రస్తుతం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన చిత్రాలు చాలా కాలం క్రితమే తెరపైకి వచ్చేవి. ఈ యంగ్ హీరో నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల విషయానికొస్తే “డాక్టర్”, “అయలాన్”, “డాన్” వంటి కొన్ని చిత్రాలను వరుసగా లైన్ లో పెట్టాడు. ఇది కాకుండా శివకార్తికేయన్ హీరోగా ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది.…
తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే తలపతి విజయ్, ధనుష్ ఇద్దరూ అధికారికంగా తమ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలను ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మితం కానుంది. అయితే ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి బాటలోనే నడుస్తున్నాడు…