Student develops 'anti-rape footwear' with GPS: కర్ణాటకకు చెందిన పదో తరగతి విద్యార్థిని వినూత్నంగా ఆలోచించింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ని తయారు చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు ప్రయత్నించే కామాంధుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ పాదరక్షలు ఉపయోగపడనున్నాయి. బాలికలు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నేరస్థుల నుంచి కాపాడుకునేందుకు ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ ఉపయోగపడనుందని వీటిని రూపొందించిన విద్యార్థిని చెబుతోంది.