నిత్యావసర సరకులపై.. మరీ ముఖ్యంగా పిల్లలకు పౌష్టిక ఆహారం పై పాలు, అనుబంధ ఉత్పత్తులపై ఏమాత్రం ఆలోచన లేకుండా కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో.. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కంటోన్మెంట్‌లోని టివోలి చౌరస్తా వద్ద ‘మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో చర్చనీయాంశకంగా మారింది. మొన్నటి వరకు…
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్.. మళ్లీ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈనెల 20న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నారు. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం సన్నాహాలు జరుగుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా భేటీకానున్నారు. మహారాష్ట్ర సియం ఉద్దవ్ థాకరే టిఆర్ఎస్ అధినేత కేసియార్‌కు ఫోన్ చేశారు. ఈనెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. బిజెపికి వ్యతరేకంగా కేసియార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ స్ఫూర్తి కోసం ప్రజా వ్యతిరేక విధానాలను…