Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
Karnataka: కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో మరో వివాదం తెర పైకి వచ్చింది. కర్ణాటక యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాంలో ‘‘విద్వేషపూరిత’’ కంటెంట్ ఉండటంపై వివాదం చెలరేగింది. కర్ణాటక లా స్టూడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ‘‘బెళగు 1’’ పుస్తకంలో ‘‘రాష్ట్రీయతే’’ అనే శీర్షికతో కూడిన అంశాలు ఉన్నాయని,