నటి ఖుష్బూ భర్త సుందర్ సి. కి తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది. ‘అరుణాచలం’ వంటి వినోదభరిత చిత్రాలతో పాటు, ‘సత్యమే శివం’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా సుందర్ సి తీశాడు. అయితే… గత కొంతకాలంగా సరైన విజయాన్ని సాధించని సుందర్… సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని అనుకుంటున్న ప్రతిసారీ హారర్ జానర్ ను ఆశ్రయిస్తున్నాడు. అలా 2014లో ‘అరణ్మనై’ పేరుతో ఓ సినిమా తీశాడు. అది ‘చంద్రకళ’గా తెలుగులో డబ్ అయ్యింది. ఆ…