పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లు గోలన్ హైట్స్‌ను తాకాయి. దీంతో ప్రైవేటు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా బుధవారం ఈ దాడి జరిగినట్లుగా సమాచారం.