అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు..
సాధారణంగా ఎక్కడ చూసినా ఆలయాల్లో ప్రసాదం పేరిట పులిహోర లేదా కేసరి లేదా దద్దోజనం లేదా లడ్డూలు అందిస్తుంటారు. కానీ ఏపీలోని అన్నవరం దేవస్ధానంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదం కింద భక్తులకు గోధుమ నూకతో చేసిన ప్రసాదం అందిస్తారు. ఈ ప్రసాదం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రసాదం మరెక్కడా దొరకదు. తిరుపతి లడ్డూ ఎంత ప్రసిద్ధి చెందిందో.. అన్నవరం ప్రసాదం కూడా అంతే ఆదరణ పొందింది. అన్నవరం ఆలయంలో గోధుమ…