తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై గురువారం ఆరోగ్య, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్‌ను డెయిరీ ఫాం రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు.…