ఈ మధ్య కాలంలో కమెడియన్స్ ఒక్కొక్కరూ హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో హాస్యనటుడు సుహాస్ ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారాడు. ఇప్పుడు సెకండ్ వేవ్ టైమ్ లో సత్య ‘వివాహ భోజనంబు’తో హీరో అయిపోయాడు. విశేషం ఏమంటే… ‘కలర్ ఫోటో’ మూవీ ఓటీటీలో విడుదలైనట్టుగానే ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ సైతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో ప్రసారం అవుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఇదే కావడం…
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తొలి వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైన తలవంచక తప్పట్లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా…