తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు.