భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కొనసాగిస్తోంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని.. సిల్లీ విషయాలను సీరియస్‌గా తీసుకుంటోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ఆయన అన్నారు.
కేంద్ర నగర వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో కలిశారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి నివాసంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానిస్టేబుల్కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధం ఏమిటనుకుంటున్నారా?. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాఫిక్ కానిస్టేబుల్ రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.