ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. నేడు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్‌ను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం .. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు.