అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతదేహాలు ఈ రోజు అమలాపురం హౌసింగ్ బోర్డులో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి చేర్చారు.. ఒక్కసారిగా ఆ మృతదేహాలను చూసి బోరున విలపించారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వెక్కి వెక్కి ఏడ్చారు.. ఆయన్ని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఓదార్చారు..
చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. నేను చేసినా తప్పు ఎంటో జగన్ చెప్పాలి? అని నిలదీశారు. ఐదేళ్లుగా ఎప్పుడైనా వైఎస్ జగన్ ఒక్కసారి అయినా మమ్మల్ని పిలిచి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ చెప్పకముందే నేను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగానన్న ఆయన.. దళితులకు జగన్ ఏమి న్యాయం చేశారు..? దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా..? అంటూ మండిపడ్డారు.
YS Sharmila: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని స్థాపించి ప్రభావం చూపలేకపోయిన మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా ప్రయోజనమేనన్న ఆయన.. వైసీపీ నుంచి బయటకు రావాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదు.. షర్మిల రాకతోనే వెంటనే అన్నీ జరగబోవు అని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నంలో కలకలం సృష్టించిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఇక, అరెస్ట్ అయిన 11 మంది నిందితులు ఫొటోగ్రాఫర్లే.. అరెస్ట్ తర్వాత వారిని కోర్టుముందు హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.. ఈ కేసులో మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. కీలక నిందితుడిగా ఉన్న బాలిక ప్రియుడు ఇమ్రాన్తో పాటు…
కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో ఓ వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. మండలంలోని పెదప్రోలు గ్రామస్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడ వాలంటీర్ సుధాకర్ రెచ్చిపోయాడు. డీజే వివాదంలో గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాడు.. మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు మండిపడుతున్నారు స్థానికులు..