గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో తన సొంత ముద్ర ఉండేలా బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందట..