Andhra Pradesh Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత విషయాలనే ప్రస్తావించింది. ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని మరోసారి లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థికసంఘం ప్రాధాన్యత ఇవ్వలేదని నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32…