TTD Adulterated Ghee Case: తిరుమల తిరుపతి దేవస్థానంలో బాధ్యతాయుతమైన జనరల్ మేనేజర్ పోస్టులో ఉన్న సుబ్రహ్మణ్యం (ఏ29) నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిట్ స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం 2017 జులై 6 నుంచి 2018 మే 17 వరకు ఒకసారి కొనుగోళ్ల విభాగం జీఎంగా పనిచేశారు. 2020 మే 13 నుంచి 2023 మే 1 వరకు మరోసారి ఇలా రెండుసార్లు జీఎంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీటీడీలో ఈఈ గా ఉన్నారు. తిరుమల…