మరోసారి ఆందోళన బాట పట్టేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు సిద్ధమయ్యారు. జీతాల కోసం సమ్మెకు దిగనున్నారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఉక్కు ఉన్నతాధికారులను పిలిచి జేసీఎల్ (JCL) వివరణ కోరింది. కాగా.. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.